సంయమనం పాటించండి
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:01 AM
ఎస్టీ మాకివలస గ్రామస్థులు, హరేరామ హరేకృష్ణ సభ్యులు సంయమనం పాటించి సహకరించాలని ఇరువర్గాలకు న్యాయం చేస్తామని తహసీల్దార్ జె.రామారావు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు సూచించారు.
జలుమూరు అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎస్టీ మాకివలస గ్రామస్థులు, హరేరామ హరేకృష్ణ సభ్యులు సంయమనం పాటించి సహకరించాలని ఇరువర్గాలకు న్యాయం చేస్తామని తహసీల్దార్ జె.రామారావు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు సూచించారు. మాకివలస గ్రామంలో శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు అధికారులు ఆదివారం గ్రామాన్ని సందర్శించారు. ఇరువర్గాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేసినందున ఎవ రూ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుమంటామన్నారు. భూ సమస్యపై ఉన్నతాధి కారులు ఎవరికి హక్కులున్నాయో రికార్డులను పరిశీలించి ప్రకటి స్తారని, అంతవరకు ఎటువంటి కవ్వింపు చర్యలు పాల్పడవద్దన్నా రు. కార్యక్రమంలో ఎస్‌ఐ అశోక్‌బాబు, డీటీ మధుబాబు, ఆర్‌ఐ కిరణ్, గ్రామస్థులు, హరేకృష్ణ సభ్యులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఎస్టీ మాకివలస గిరిజనులపై దాడిచేసి మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించిన హరేరామ హరేకృష్ణ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్టీ మాకివలస గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన గ్రామంపై రాత్రి సమయంలో దాడిచేసి బెదిరించిన హరేరావ సభ్యులపై హత్యానేరం కేసు నమోదు చేయాలన్నారు. ఈ భూ వివాదాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, అధికారులు పరి ష్కారమార్గంపై చర్యలు తీసుకుంటున్నారన్నా రు. అయినప్పటికీ హరేరామ హరేకృష్ణ సభ్యులు గిరిజన గ్రామంపై దాడిచేయడం అన్యాయమన్నారు.