ఉత్సాహంగా సాగిన సాఫ్ట్ టెన్నిస్ క్రీడా పోటీలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:29 PM
స్థానిక ఎన్టీఆర్ గ్రీన్‌ఫీల్డ్ క్రీడా మైదానంలో జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి బీవీ రమణ పర్యవేక్షణలో మంగళవారం జిల్లా స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలు జరిగాయి.
పాతపట్నం: స్థానిక ఎన్టీఆర్ గ్రీన్‌ఫీల్డ్ క్రీడా మైదానంలో జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి బీవీ రమణ పర్యవేక్షణలో మంగళవారం జిల్లా స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు అండర్-14, 17, 19 బాలబాలికల విభాగాల్లో నిర్వహించగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సాఫ్ట్ టెన్నిస్ అసోసియే షన్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పన్న తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి యెన్ని శేఖర్‌బాబు, జె.కృష్ణారావు, కె. రాజారావు, స్కూల్ ప్రిన్సిపాల్ కేవీ రత్నకుమారి పర్యవేక్షించారు.
బాల్ బాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ
కాశీబుగ్గ: హర్యానా రాష్ట్రంలో ఇటీవల జరిగిన 43వ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీల్లో పలాసకు చెందిన జి.ఛాయాకిరణ్ ప్రథమ స్థానం పొందాడని సంఘం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కోత పూర్ణ చంద్రరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గోల్డ్ మెడల్ అందించి అభినందించారు. బాల్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ పోటీల్లోనే రాణించేలా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు పేట విద్యార్థులు
నరసన్నపేట: జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో సత్యవరం, దేశవానిపేట పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎంలు తెలిపారు. 200 మీటర్ల పరుగు పందెంలో డి.లక్ష్మణ, లాంగ్ జంప్‌లో బి.హారిక, దేశవానిపేట పాఠశాలకు చెందిన రవికుమార్ బేస్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎంలు ఓకులాదేవి, జయరావు పేర్కొన్నారు. తెలిపారు.
గంగివలస కేజీబీవీ విద్యార్థినులు..
గంగివలస (పోలాకి): స్కూల్ గేమ్స్ హాకీ, నెట్‌బాల్, రబ్బీ, చెస్ పోటీల్లో గంగివలస కేజీబీవీ నుండి 13 మంది బాలికలు ఎంపికైనట్టు సంక్షేమాధికారి శారద, పీఈటీ ప్రియాంక తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వీరంతా రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారన్నారు. అలాగే దీర్గాశి ఉన్నతపాఠశాల నుంచి వాలీబాల్‌లో జనాపూజిత, బోర యశస్విని రగ్బీలో ఇరువురు బాలికలు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు హెచ్‌ఎం ఎస్.శ్రీనివాసరెడ్డి, పీఈటీ జి.ఉషారాణి తెలిపారు. విద్యార్థి నులను వారు అభినందించారు.