గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే బగ్గు
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:35 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్య మని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
పోలాకి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్య మని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం వనితమండలం, గొల్లలవలస, గాతల వలస, చెల్లాయివలస కమ్మరిపేట, జడూరు, గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, గోకులా లను ఉపాధి నిధులతో చేపడుతున్నామన్నారు. కార్యక్రమం లో జనసేన నాయకుడు ప్రవీణ్‌కుమార్, నేతలు బగ్గు అర్చన, ఎంవీ నాయుడు, ఆర్కే .నాయుడు, సూరపునారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు.
పల్లెల ప్రగతే ధ్యేయం
హరిపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పల్లెల ప్రగతే కూటమి ప్రభుత్వఽ ధ్యేయమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా రు. అల్లిమెరక, నారాయణ పురం, వీజీపురం గ్రామాల్లో సోమవారం సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్లో సంస్థ ఆధ్వర్యంలో టీ గంగువాడలో సామాజిక భవనాన్ని ప్రారం భించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యో ధన, జీకే నాయుడు, బమ్మిడి కర్రయ్య, ఎంపీడీవో సూర్య నారాయణరెడ్డి, డీఈఈ జి.రవి కుమార్ పాల్గొన్నారు.