ప్రతిభ చూపిన వారికి అభినందన
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:26 AM
విధి నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి ఎప్పుడూ గుర్తిం పు లభిస్తోందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి ఎప్పుడూ గుర్తిం పు లభిస్తోందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు ఛేదనలోను, ముద్దాయిల కు శిక్షలు పడడం తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించిన వారికి శనివారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో ఎస్పీ మొత్తానికి 88 మందికి ప్రశంసా ప్రతాలతో పాటు నగదు పురష్కారాన్ని అందజేశారు. అలాగే పలువురు పోలీసు అధికారులు సిబ్బందికి గుడ్ సర్వీస్ రిజిస్టర్‌లో ఎంట్రీ చేయాలని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు వివేకానంద్, పాపారావు, రాజశేఖర్, ప్రసాదరావు, సీఐలు అవతారం, ఇమ్మాన్యూల్ రాజు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.