విజనున్న పాలకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:11 AM
ప్రపంచ వ్యా ప్తంగా విజనున్న పాలకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్ర త్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యా ప్తంగా విజనున్న పాలకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్ర త్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శు క్రవారం స్థానిక పాలిటెక్నిక్ కళా శాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ జాబ్‌మేళాలో 185 మంది వివిధ కంపెనీలకు ఎంపికైనట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్ ఉరిటి సాయికుమార్, స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోపి, ఎంపీటీసీ గొర్లె సూర్యం, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.