Share News

సమయపాలన పాటించకుంటే చర్యలు

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:25 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా వృత్తివిద్యా శాఖాధికారి(డీవీఈవో) ఎస్‌.తవిటినాయుడు అన్నా రు.

 సమయపాలన పాటించకుంటే చర్యలు
ఎల్‌ఎన్‌పేట: రికార్డులను పరిశీలిస్తున్న డీవీఈవో తవిటినాయుడు

ఎల్‌.ఎన్‌.పేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా వృత్తివిద్యా శాఖాధికారి(డీవీఈవో) ఎస్‌.తవిటినాయుడు అన్నా రు. లక్ష్మినర్సు పేట ప్రభుత్వ జూనియర్‌ కళాశా లను బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల హాజరు పట్టిక లు, రికార్డులను పరిశీలించారు. అధ్యాపకులు ప్రభుత్వ నిబం ధనల ప్రకారం కళాశాల సమయపాలన పాటించాలన్నారు. సకాలంలో సిలబస్‌లు పూర్తిచేసి ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దాలని సూచించారు. ఏజీఎంవో తాతారావు పాల్గొన్నారు.

తొమ్మిది ప్రిన్సిపాళ్ల పోస్టులు ఖాళీ

హిరమండలం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొమ్మిది జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీవీఈవో ఎస్‌.తవిటినాయుడు తెలిపారు. బుధవారం హిర మండ లం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్‌ పోస్టుల స్థానంలో అదే కళాశాలలో పనిచేస్తున్న సీనియర్‌ ఆధ్యాపకులకు బాధ్యతలు అప్పగించామన్నారు. గోవిందపురం, నందిగాం, నివగాం కళాశాల లకు సొంత భవనాలు లేవన్నారు. ఈ ఏడాది 12,375 మంది ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. బోధనకు అధ్యాపకుల కొరత లేదన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:25 AM