ఆదర్శనీయుడు ఆచార్య రోణంకి
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:49 PM
బహుభాషా కోవిదుడు, టెక్కలిని అంత ర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆచార్య రోణంకి అప్పల స్వామి అని, ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని డా.బీఆర్ ఏయూ అధ్యాపకుడు డాక్టర్ బీవీ రమణమూర్తి అన్నారు.
టెక్కలి: బహుభాషా కోవిదుడు, టెక్కలిని అంత ర్జాతీయ సాహితీ ప్రపంచా నికి పరిచయం చేసిన వ్యక్తి ఆచార్య రోణంకి అప్పల స్వామి అని, ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని డా.బీఆర్ ఏయూ అధ్యాపకుడు డాక్టర్ బీవీ రమణమూర్తి అన్నారు. రోణంకి అప్పల స్వామి 115వ జయంతి సందర్భంగా ఆదివారం రిటైర్డ్ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రమణమూర్తి మాట్లాడుతూ.. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, గ్రీక్, హిబ్రూ, ఇటాలియన్ తదితర ఆరు యూరోపియన్ భాషల్లో అప్పల స్వామి మాస్టారు నిష్ణాతులన్నారు. శ్రీశ్రీ, ఆరుద్రలకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చారని, అల్లసాని పెద్దన, బట్లుమూర్తి, క్షేత్రయ్య, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో తదితర కవిత లను ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రోణంకి రామచంద్రరావు, బొడ్డ అయ్య బాబు, వర్సిటీ అధ్యాపకుడు డాక్టర్ లీలా వరప్రసాద్, సంఘ నేతలు కె.ధనుంజయరావు, డాక్టర్ జగన్నాఽథరావు, జీవీ రెడ్డి, చంద్రశేఖర్ పట్నాయక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన గుజ్జు విలియమ్స్, హనుమంతు శివానంద, డి.సూర్యకాంతం, ఎన్.సురేష్‌కుమార్, తులసీప్రసాదరావులను సత్కరించారు.