ఆర్జీవీపై కాపునాడు నేతల ఫిర్యాదు
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:09 AM
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కాపునాడు నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
అమలాపురం టౌన్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కాపునాడు నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సమావేశమైన నేపథ్యంలో ఆర్జీవీ సోషల్ మీడియాలో విమర్శలు చేసి కాపు సామాజిక వర్గాన్ని కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్జీవీపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.