Share News

ప్రసవ వేదనతో గర్భిణి విలవిల

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:15 AM

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది అలసత్వం కారణంగా ఒక నిండు గర్భిణీ ఆసు పత్రి బెడ్‌ పైనే ప్రసవించిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.

 ప్రసవ వేదనతో గర్భిణి విలవిల

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పట్టించుకోని వైద్యులు..

తాడేపల్లిగూడెం రూరల్‌, అక్టోబరు 19 : తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది అలసత్వం కారణంగా ఒక నిండు గర్భిణీ ఆసు పత్రి బెడ్‌ పైనే ప్రసవించిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. తాడేపల్లిగూడెం మం డలం ఎల్‌ అగ్రహారంకు చెందిన ఎర్రా శకుంతల గర్భిణీగా డెలివరి కోసం ఏరియా ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చేరింది. అసుపత్రి సిబ్బంది ఆమెను పట్టించుకోకుండా మహిళల వార్డులోనే వదిలేయడంతో శకుంతల తల్లి ధనలక్ష్మి పలుమార్లు వైద్యులను తన కుమార్తెకు ప్రసవవేదన పడుతోందని వైద్యం అందించాలని వేడుకుంది. శుక్రవారం రాత్రి శకుంతలకు ప్రసవ వేదన ఎక్కువ కావడంతో వైద్యుల కోసం ఎదురుచూశారు. అప్పటికే డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరించి రేపు ఉదయం చూద్దామంటూ చెప్పి దురుసుగా ప్రవర్తించారు. చేసేదిలేక శకుంతలను మహిళల వార్డుకు తీసుకువెళ్ళిపోయారు. రాత్రంతా ప్రసవ వేదనతో ఇబ్బంది పడ్డ శకుంతల ఉదయానికి మంచం పైనే ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయా న్ని అక్కడ శిక్షణలో ఉన్న నర్సులు గమనించి శంకుతలను వైద్యుల వద్దకు తరలించారు. ఈ ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టడంతో మీడియా రంగప్రవేశం చేసింది. దీంతో వైద్యులు అక్కడ సమస్య లేనట్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలె త్తిందని శకుంతల తల్లి ధనలక్ష్మి, తండ్రి దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా ఈ ఘటనపై పరిశీలన కమిటీ వేశామని తెలిపారు.

Updated Date - Oct 20 , 2024 | 01:15 AM