Share News

నేడు గురుపూజోత్సవం

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:12 AM

ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని గురువారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిర్వహిస్తున్నారు.

నేడు గురుపూజోత్సవం

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 62 మందికి అవార్డుల ప్రదానం

ఒంగోలు(విద్య), సెప్టెంబరు 4 : ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని గురువారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ అధ్యక్షత వహిస్తారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్‌ గంగాడ సుజాత ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. విశిష్ట అతిథులుగా రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, గౌరవ అతిఽథులుగా శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎస్పీ దామోద్‌తోపాటు పలువురు జిల్లా శాఖ అధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 62మందికి అవార్డులు ప్రదానం చేస్తారు.

Updated Date - Sep 05 , 2024 | 08:34 AM