పోలీసుల త్యాగాలు మరువం
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:08 AM
ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలు మరువలేమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమ వారం స్థానిక డీపీవోలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి స్వామి, 20 సూత్రాల పఽథకం చైర్మన్ లంకా దినకర్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా న్యాయాధికారి ఎ.భారతి, ఎస్పీ దామోదర్‌తో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి డాక్టర్ స్వామి
అమరవీరుల స్థూపం వద్ద నివాళి
నగరంలో పోలీసుల ర్యాలీ
ఒంగోలుక్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలు మరువలేమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమ వారం స్థానిక డీపీవోలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి స్వామి, 20 సూత్రాల పఽథకం చైర్మన్ లంకా దినకర్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా న్యాయాధికారి ఎ.భారతి, ఎస్పీ దామోదర్‌తో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. శక్తివంచన లేకుండా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి త్యాగాలు వెలకట్టలేనివని కీర్తించారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ఈనెల 21న దేశం యావత్తు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నదని తెలిపారు. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాములా మారిందని గుర్తు చేశారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఈ ఏడాది 216 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారన్నారు. అనంతరం జిల్లాలో పోలీసు అమర వీరుల కుటుంబాలకు మంత్రి చేతులమీదుగా సాయం అందజేశారు. విధి నిర్వహణలో ఇటీవల మృతిచెందిన ఐదుగురు పోలీసుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను ఇచ్చారు. ఏఎస్పీ కె.నాగేశ్వరరావు తొలుత దేశవ్యాప్తంగా విఽధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 216 మంది పేర్లు చదివి నివాళి అర్పించారు. పోలీసు కార్యాలయం నుంచి ర్వాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఆర్టీసీ డిపో నుంచి తిరిగి పోలీసు కార్యాలయం వరకు చేరుకుంది. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ ఆశోక్‌బాబు, ఒంగోలు ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, డీటీసీ ఆర్.సుశీల, డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సీఐలు పాండురంగరావు, రాఘవేంద్రరావు, సూర్యనారాయణ, దేవప్రభాకర్, అజయ్‌కుమార్, నాగరాజు తదితరుల పాల్గొన్నారు.