పేదల గృహ నిర్మాణ బిల్లులకు మోక్షం
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:29 PM
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన గృహనిర్మాణ పెండింగ్ బిల్లులకు కూటమి ప్రభుత్వం మోక్ష్యం కల్గించింది. ప్రతి పేద కుటుంబంకు నీడ కల్పించాలనే లక్ష్యంతో 2014 నుండి 2019 మద్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఒకొక్క ఇంటికి ఓసీ, బీసీ వర్గాలకు రూ.1.50 లక్షలు, ఎస్సీలకు రూ.2 లక్షలు, ఎస్టీ వర్గాలకు రూ.2-50 లక్షలు చెప్పున నిధులు కేటాయించింది.
2014-19 మధ్య మండలంలో 799 మంది లబ్ధిదారులు
చెల్లించనున్న మొత్తం రూ.1,25,69,926
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారుల్లో హర్షం
దొనకొండ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన గృహనిర్మాణ పెండింగ్ బిల్లులకు కూటమి ప్రభుత్వం మోక్ష్యం కల్గించింది. ప్రతి పేద కుటుంబంకు నీడ కల్పించాలనే లక్ష్యంతో 2014 నుండి 2019 మద్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఒకొక్క ఇంటికి ఓసీ, బీసీ వర్గాలకు రూ.1.50 లక్షలు, ఎస్సీలకు రూ.2 లక్షలు, ఎస్టీ వర్గాలకు రూ.2-50 లక్షలు చెప్పున నిధులు కేటాయించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహలకు సంబందించి బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. వైసీపీ ప్రభుత్వంలో అప్పులు చేసి గృహలు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లుల మంజూరు కోసం కార్యాలయాల్లోని అధికారులు, వైసీపీ పాలకుల చుట్టూ అప్పట్లో ప్రదర్శనలు చేసినా వైసీపీ పాలకులకు కనికరించలే దు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అప్పటి గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో గృహ నిర్మాణశాఖ ఏఈ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వర్క్ ఇన్‌స్పెక్టర్, స్ధానిక టీడీపీ శ్రేణులు టీడీపీ ప్రభుత్వంలో నిర్మించుకొని వైసీపీ హయాంలో నిలచిన గృహల స్ధితిగతులపై సర్వే చేపట్టారు. నిర్మాణాలు ఏ స్ధాయిలో ఉన్నాయో ఇంటింటికి తిరిగి క్షేత్రస్ధాయిలో విచారించి వివరాలను నమోదు చేస్తున్నారు. మండలంలో మొత్తం 799 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 252 మంది గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోగా, 283 మంది శ్లాబులెవల్, 30 మంది రూఫ్‌లెవల్, 150 మంది లబ్ధిదారులు బేస్‌మట్టం వరకు నిర్మాణాలు చేపట్టగా, 84 మంది నిర్మాణాలు ప్రారంబించలే దనేది సమాచారం. అప్పట్లో దశలవారీగా కొంతమేర బిల్లులు చెల్లించినా చివరిలో లబ్ధిదారుల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మండలంలో రూ.1,25,69,926 బిల్లులు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో బిల్లులు అప్‌లోడ్ చేసినా 2019 ఎన్నికల ప్రక్రియ రావటంతో నిధుల మంజూరుకు బ్రేక్ పడింది. అనంత రం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులను నిలిపివేసి లబ్ధిదారులకు మొండిచేయి చూపింది. అప్పులు చేసి గృహ నిర్మాణాలు చేపట్టుకొని ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారుల ఇబ్బందులను గుర్తించిన టీడీపీ కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లుల మంజూరుకు చర్యలు చేపట్టటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.