Share News

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:57 PM

ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూ టమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆపార్టీ ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అ న్నారు. దర్శి పట్టణంలోని 18వ వార్డులో శని వారం మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తో కలిసి ఆమె పింఛన్లు పంపిణీ చేశారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
పింఛన్లు పంపిణీ చేస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూ టమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆపార్టీ ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అ న్నారు. దర్శి పట్టణంలోని 18వ వార్డులో శని వారం మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తో కలిసి ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ అభి వృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో కూట మి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, మరో వైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఆదివారం సెలవు కావటంతో అవ్వా, తాతలు ఎదురుచూడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టంచిందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ఏనాడు సకాలంలో పింఛన్లు, జీతాలు ఇచ్చిన పాపాన పోలేదని డాక్టర్‌ లక్ష్మి విమర్శించారు. ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో అవ్వా తాతల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ.15 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు వరుసగా అమలవు తుండటంతో అన్నీవర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆమె వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మెరు గైన వైద్యసేవలందించాలని టీడీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. శనివారం మండలం లోని చందలూరు పీహెచ్‌సీని ఆమె సం దర్శించారు. అక్కడ ప్రజలకు వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థా యిలో కల్పిస్తామని చెప్పారు. ఏమైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వైద్యాధికారులకు సూచిం చారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మె రుగైన వైద్యం అందించి ప్రజల అభిమానాన్ని చూర గొనాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ బ్లెస్సీ, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల ల లిత్‌సాగర్‌, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:57 PM