ఆంజనేయులకు జాతీయసేవా పురస్కారం
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:52 PM
దివ్యాంగ రక్షక ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవుళ్ల ఆంజనేయులు సేవలను గుర్తించి సత్తెనపల్లి హెల్త్ ఫౌండేషన్ మదర్‌థెరిస్సా జాతీయసేవా పురస్కారం అవార్డును సోమవారం అందజేసింది.
పొదిలి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగ రక్షక ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవుళ్ల ఆంజనేయులు సేవలను గుర్తించి సత్తెనపల్లి హెల్త్ ఫౌండేషన్ మదర్‌థెరిస్సా జాతీయసేవా పురస్కారం అవార్డును సోమవారం అందజేసింది. అనంతరం హెల్త్ ఫౌండేషన్ వ్యస్థాపకులు కంచర్ల బుల్లిబాబు మాట్లాడుతూ పుట్టుకతో దివ్యాంగుడైనా ఆంజనేయులు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశామన్నారు. అన్నీ ఉన్నా వారు కూడా ఎవరి స్వార్ధ వారు చూసుకునే ఈ రోజుల్లో శరీరం సహకరించకపోయినా తోటి దివ్యాంగులకే కాకుండా పేదలకు, వృద్ధులకు ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. అందుకుగాను ఈ పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆంజనేయులును ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా సహాయం చేయలని వారు కోరారు. అనంతరం ఆంజనేయులును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు, కార్యదర్శి బ్రహ్మరెడ్డి, రాధ, శ్రీను, రమణయ్య ఆచారి పాల్గొన్నారు.