Share News

పన్ను చెల్లించకుంటే కొళాయి కనెక్షన్‌ కట్‌

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:28 AM

నగరంలో పన్ను చెల్లించకుంటే కొళాయి కనెక్షన్‌ కట్‌ చేయాలని కమిషనర్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సిబ్బందిని ఆదేశించారు. ‘నగర పాలికకు పన్నుపోటు’ శీర్షికన ఒంగోలులో పేరుకుపోయిన ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల పన్నులపై ఆంధ్రజ్యోతి శుక్రవారం ప్రచురిత మైన కథనానికి కమిషనర్‌ స్పందించారు.

పన్ను చెల్లించకుంటే కొళాయి కనెక్షన్‌ కట్‌
పన్ను వసూళ్లపై సిబ్బందికి సూచనలు చేస్తున్న కమిషనర్‌ వెంకటేశ్వరరావు, అధికారులు

నగరంలో వసూళ్లకు ప్రత్యేక బృందాలు

పెద్ద మొత్తం బకాయిదారులకు రెడ్‌ నోటీసులు

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నగరంలో పన్ను చెల్లించకుంటే కొళాయి కనెక్షన్‌ కట్‌ చేయాలని కమిషనర్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సిబ్బందిని ఆదేశించారు. ‘నగర పాలికకు పన్నుపోటు’ శీర్షికన ఒంగోలులో పేరుకుపోయిన ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల పన్నులపై ఆంధ్రజ్యోతి శుక్రవారం ప్రచురిత మైన కథనానికి కమిషనర్‌ స్పందించారు. పెండింగ్‌ బకాయిల వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌లోని రెవెన్యూ, ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితోపాటు సచివాలయ సెక్రటరీలను అందులో నియమించారు. డివిజన్ల వారీగా పెండింగ్‌ జాబితాలతో వసూళ్లకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయా బృం దాలకు ఆయన పలు సూచనలు చేశారు. ముందుగా పెద్ద మొత్తంలో పెండింగ్‌ ఉన్న గృహాలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్‌, వ్యాపార సంస్థలపై దృష్టిసారించాల న్నారు. మరికొన్ని బృందాలు ఇంటింటికీ తిరిగి వసూలు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రతి రోజూ వసూళ్లపై నివేదికలు అందజేయాలని ఆదేశించారు. బృందాలపై పర్యవేక్షకులుగా మునిసిపల్‌ ఇంజనీర్‌, డీఈలు, ఏఈలను నియమించారు.

Updated Date - Nov 30 , 2024 | 01:28 AM