అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:30 AM
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.
పెద్దారవీడు, అక్టోబరు 1: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండ లంలోని గుండంచర్లలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలో నూతన పింఛ న్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయంలో అనర్హులకు ఇచ్చిన పింఛన్ల ను తొలగిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు త్వరలో ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ఇవ్వనుందన్నారు. గుండంచర్ల, సుంకేసు ల, కలనూతల గ్రామాలకు తాత్కాలిక ప్రాతిపదికన గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. సుంకేసుల కొండ పైన రోడ్డు నిర్మాణానికి రూ.51లక్షలతో తారురోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్‌కు మార్, టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీని వాసులరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివా సులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వర రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జడ్డా రవి, టీడీపీ మండల నాయకులు ఇండ్లా రామకృష్ణారెడ్డి చింతకుంట్ల సుబ్బరామిరెడ్డి, దొడ్డా భాస్కరరెడ్డి, లింగాల అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.
కంభంలో ఫించన్ల పంపిణీ
కంభం : మండలంలోని అన్ని పంచాయతీ లలో సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు ఎన్‌టీఆర్ భరోసా సామాజిక ఫించన్ల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి తిరిగి ఫించన్లు పంపిణీ చేశారు. మండలంలో 1వ తేదీ సాయంత్రానికి 95 శాతం పూర్తిచేశామని ఎంపీడీవో వీరబ్రహ్మాచారి తెలిపారు.