Share News

ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తామని మోసం

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:32 AM

గత ఎన్నికల్లో సంతనూతలపాడు టికెట్‌ ఇప్పిస్తామని చెప్పి తనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి, చినగంజాం ఎంపీపీ అంకమరెడ్డి మోసం చేశారని డాక్టర్‌ యాదాల అశోక్‌ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ.25లక్షలు తీసుకుని దగా చేశారని అందులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తామని మోసం

బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డి, చిగంజాం ఎంపీపీ

అంకమరెడ్డిపై వైద్యుడు ఫిర్యాదు

రూ.25లక్షలు వసూలు చేశారని ఆరోపణ

డబ్బు తిరిగి అడిగితే కులం పేరుతో దూషణ

ఒంగోలు క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గత ఎన్నికల్లో సంతనూతలపాడు టికెట్‌ ఇప్పిస్తామని చెప్పి తనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి, చినగంజాం ఎంపీపీ అంకమరెడ్డి మోసం చేశారని డాక్టర్‌ యాదాల అశోక్‌ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ.25లక్షలు తీసుకుని దగా చేశారని అందులో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్‌ అశోక్‌ ఆరోగ్యశ్రీ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన్ను ఎన్నికలకు ముందు ప్రణీత్‌రెడ్డి వద్దకు అంకమరెడ్డి తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్‌ గురించి మాట్లాడించారని, అందుకు వారు రూ.25లక్షలు ఇవ్వాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అంకమరెడ్డికి ఫోన్‌పే ద్వారా రూ.10లక్షలు, నగదు రూ.15లక్షలు ఇచ్చానని అశోక్‌ తెలిపారు. అయితే తనకు టికెట్‌ రాలేదని, ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని అడిగితే అంకమరెడ్డి కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒంగోలు తాలూకా సీఐ ఆజయ్‌కుమార్‌కు శుక్రవారం రాత్రి ఫిర్యాదును అందజేశారు.

Updated Date - Nov 30 , 2024 | 01:32 AM