రైతులకు విద్యుత్ అధికారుల షాక్
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:22 AM
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు విద్యుత్‌శాఖ అధికారులు చుక్కల చూపిస్తున్నారు.
పొదిలి, సెప్టెంబరు 15 : ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు విద్యుత్‌శాఖ అధికారులు చుక్కల చూపిస్తున్నారు. పట్టెడు అన్నం పెట్టే రైతులపై జూలుం ప్రదర్శిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరిస్తూ రైతులను నెలలు తరబడి కాళ్లు అరిగేలా తిప్పుకుంటున్నారు. అడినంత లంచం ఇవ్వనిదే ట్రాన్స్‌పార్మర్ కాదుకదా వైరు ముక్కకూడ ఇవ్వబోమని ఆ శాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. అసలే కరువు కాటకాలతో వర్షాల లేమితో తల్లడిల్లుతున్న రైతులకు విద్యుత్ కనెక్షన్ పొందడం తలకు మించిన భారంగా మారింది.
ఒక విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు కోసం 5హెచ్‌పీ మోటారుకు రూ.6200ల రుసుం చెల్లించాలి. కాని అధికారులు ఇష్టారాజ్యం గా రూ.20వేలకు ముక్కపిండి వసూలు చేస్తున్నారు. అదేమని నిలదీసిన రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. వారి దరఖాస్తులను ఏకంగా అటకెక్కిస్తున్నారు. వారిని ముప్ప తిప్పలు పెడుతున్నా రు. అదనపు డబ్బులు చెల్లిస్తే వారంలో అంచనాలు వేసి అప్పటికప్పుడు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు 5హెచ్‌పీ మోటార్లకు ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి. అరుతే ఒక్కొకరి నుంచి రూ.20 వేల చొప్పున ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ.60 వేలు వసూలు చేసి అప్పటికప్పుడు ట్రాన్స్‌ఫారాలను మంజూరు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదు. వ్యవసాయ సీజన్ మారుతుందనే భయంతో అధికారులు అడిగిన కాడికి కొంతమంది రైతులు డబ్బులు ఇచ్చి తమ అవసరం గడుపుకుంటు న్నారు. లంచం ఇవ్వలేని నిస్సహాయ రైతులు ఆ శాఖ కార్యాల యం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాతైనా పరిస్థితులు మారుతామోనని అన్నదాతలు ఎదరు చూసినప్పటికీ వారి నిరీక్షణ ఫలించడం లేదు.