Share News

నేడు పింఛన్‌ల పంపిణీ

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:26 AM

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద డిసెంబరుకు సంబంధించిన సామాజిక పింఛన్లను జిల్లావ్యాప్తంగా శనివారం పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 2,86,034 మంది లబ్ధిదారులకు రూ.122.22 కోట్లను అందజేయనున్నారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

నేడు పింఛన్‌ల పంపిణీ

2,86,034మందికి రూ.122.22 కోట్లు

బ్యాంక్‌ల నుంచి డ్రా చేసిన సచివాలయ సిబ్బంది

జనవరిలో కొత్తవి మంజూరు

నెన్నూరుపాడులో పాల్గొననున్న మంత్రి స్వామి

ఒంగోలునగరం, నవంబరు 29 (ఆంధ్ర జ్యోతి) : ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద డిసెంబరుకు సంబంధించిన సామాజిక పింఛన్లను జిల్లావ్యాప్తంగా శనివారం పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 2,86,034 మంది లబ్ధిదారులకు రూ.122.22 కోట్లను అందజేయనున్నారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటలకే ప్రారంభించనున్నారు. ఈ మేరకు అవసరమైన నగదును శుక్రవారమే బ్యాం కుల నుంచి డ్రా చేశారు. గత నెలలో తీసుకోని 1,283 మంది లబ్ధిదారులకు కూడా రెండు నెలలకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి అందజేయనున్నారు. డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభు త్వం లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పింఛన్‌ను అందజేస్తోంది. కాగా కొత్త పింఛ న్‌లను జనవరి మాసం నుంచి మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పది వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా డిసెంబరులో కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. కొత్త పింఛన్‌ కోసం అందిన దరఖాస్తులపై ఆ నెలలోనే విచారణ పూర్తి చేసి జనవరి నుంచి మంజూరు చేయనుంది. కొండపి మండలం నెన్నూరుపాడులో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘి సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాల్గొననున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 01:26 AM