Share News

చచ్చినా చావే!

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:19 AM

వృద్ధాప్యంతోనో, మరే ఇతర కారణాలతో కాలం చేస్తే ఆ గ్రామస్థులు శ్మశానానికి మృతదేహాన్ని మోసుకెళ్లాలంటే బతికినోళ్ల చావుకు వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రావిపాడు గ్రామానికి కిలోమీటరు అవతల ఊరికి దూరంగా శ్మశానం ఉంది.

చచ్చినా చావే!
గుండ్లకమ్మ వాగు నుంచి శవాన్ని మోసుకుని శ్మశానానికి వెళ్తున్న రావిపాడు గ్రామస్థులు

రావిపాడులో శ్మశానానికి వెళ్లాలంటే గుండ్లకమ్మ దాటాల్సిందే

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోని పాలకులు

కంభం, సెప్టెంబరు 11 : వృద్ధాప్యంతోనో, మరే ఇతర కారణాలతో కాలం చేస్తే ఆ గ్రామస్థులు శ్మశానానికి మృతదేహాన్ని మోసుకెళ్లాలంటే బతికినోళ్ల చావుకు వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రావిపాడు గ్రామానికి కిలోమీటరు అవతల ఊరికి దూరంగా శ్మశానం ఉంది. గ్రామానికి, శ్మశానానికి మధ్యలో గుండ్లకమ్మ వాగు ఉంది. ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లాలంటే వేసవి, శీతాకాలంలో ఎలాంటి సమస్య ఉండదు. వర్షాకాలంలో మాత్రం గుండ్లకమ్మ వాగు నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. వాగుపారే సమయంలో ఎవరైనా మరణిస్తే శ్మశానానికి వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. నడుముల పైకి పారుతున్న గుండ్లకమ్మ వాగులోకి దిగి భుజంపై పాడెను మోస్తూ జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి వస్తోంది. చివరి చూపు చూసేందుకు బంధువులు, మహిళలు, పిల్లలు వాగు దాటలేని పరిస్థితి. వాగు అవతల ఒక్క శ్మశానమేకాక రైతుల పొలాలు కూడా ఉన్నాయి. వాగు ఉధృతంగా పారే సమయంలో పొలాలకు వెళ్లలేని పరిస్థితి. సమస్యను గత వైసీపీ పాలనలో నాయకులు, అధికారుల దృష్టికి ఎన్నిమార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి వాగుపై చప్టాను నిర్మించేందుకు నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 01:19 AM