అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:00 AM
దర్శి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య సూచించారు. శనివారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దర్శి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): దర్శి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య సూచించారు. శనివారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర పంచాయతీలోని అన్నీప్రాంతాల్లో నూరుశాతం సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేస్తామన్నారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందిం చేందుకు ఇంటింటికి కొళాయి పథకాన్ని అమల్లోకి తెస్తామన్నారు. అమృత పథకం అమలుకు సమావేశం ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్‌చైర్మన్ జి.స్టీవెన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.