Share News

ప్రాణం తీసిన కంచె

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:39 PM

అడవి పందులకోసం వేసిన కంచె ఓ రైతు పాలిటి మృత్యు పాశమైంది. మండలంలోని మూగచింతల గ్రామానికి చెందిన వేటగాళ్లు అడవి పందులకోసం విద్యుత్‌ కంచెను గ్రామ సమీప పొలాల్లో ఏర్పాటు చేశారు. అది గమనించని రైతు మన్నెం వెంకటేశ్వర్లు (40) శనివారం రాత్రి పొలానికి వెళ్లి విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు.

  ప్రాణం తీసిన  కంచె
బావిలో నుంచి తీసున్న రైతు మృత దేహం

అడవి పందుల కోసం కంచె వేసిన వేటగాళ్లు

భయపడి శవాన్ని బావిలో పడేసిన వైనం

కొండపి, సెప్టెంబరు15: అడవి పందులకోసం వేసిన కంచె ఓ రైతు పాలిటి మృత్యు పాశమైంది. మండలంలోని మూగచింతల గ్రామానికి చెందిన వేటగాళ్లు అడవి పందులకోసం విద్యుత్‌ కంచెను గ్రామ సమీప పొలాల్లో ఏర్పాటు చేశారు. అది గమనించని రైతు మన్నెం వెంకటేశ్వర్లు (40) శనివారం రాత్రి పొలానికి వెళ్లి విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. కంచెలో ఓ అడవి పంది, జింక కూడా పడింది. ఎర వేసిన వేటగాళ్లు గమనించి భయపడి రైతు శవాన్ని సూదూరంగా ఉన్న పొలాల్లోని బావిలో పడేశారు. తర్వాత ఏమీ ఎరగనట్టు వారు గ్రామంలోకి వచ్చారు. ఎంతకూ వెంకటేశ్వర్లు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వెతుకులాడి ఆచూకీ దొరక్కపోవడంతో కొండపి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. సమస్య జటిలం అవుతుండటంతో వేటగాళ్లు విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేశారు. తాము భయపడి అలా చేశామని వాపోయారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును పడేసిన బావిలో నుంచి శవాన్ని వెలుపలకు తీసి ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కృష్ణబాజీబాబు తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 11:40 PM