Share News

విపక్షాలది దుష్ప్రచారం: మంత్రి కొండపల్లి

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:35 AM

విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రభావంతో కేవలం ఒక్కరు మరణించారని, మిగతా ఏడూ సహజ మరణాలేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

విపక్షాలది దుష్ప్రచారం: మంత్రి కొండపల్లి

విజయనగరం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రభావంతో కేవలం ఒక్కరు మరణించారని, మిగతా ఏడూ సహజ మరణాలేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఆదివారం విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇతరత్రా మరణాలకు కూడా డయేరియా కారణమని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవంగా డయేరియాతో కేజీహెచ్‌లో ఒక్కరే మరణించారని చెప్పారు. డయేరియా ప్రబలిన వెంటనే వైద్య ఆరో గ్య శాఖ చర్యలు చేపట్టిందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో డయేరియా అదుపులో ఉందని తెలిపారు. ముందు జాగ్రత్తగా ప్రతి 20 ఇళ్లకు ఒక ఏఎన్‌ఎంను ఆరోగ్యశాఖ నియమించిందని చెప్పారు.

Updated Date - Oct 21 , 2024 | 03:35 AM