ఆక్రమణల పరిశీలనకు కదిలిన అధికారులు
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:00 AM
ఆక్ర మణలు కొంతమేరకేనా? అనే శీర్షికతో ఆంధ్ర జ్యోతిలో శనివారం వెలు వడిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందిం చింది.
బి.కొత్తకోటలో ప్రభుత్వ స్థలం గుర్తింపునకు శ్రీకారం
బి.కొత్తకోట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆక్ర మణలు కొంతమేరకేనా? అనే శీర్షికతో ఆంధ్ర జ్యోతిలో శనివారం వెలు వడిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందిం చింది. తక్షణం ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై పరి శీలన చేసి నివేదిక ఇవ్వా లని జిల్లా కలెక్టర్, సబ్‌కలెక్టర్ ల ఆదేశాల మేరకు స్థానిక అధికార యంత్రాంగం కదిలింది. మండల తహశీల్దార్ మహమ్మద్ అన్సారీ ఎఫ్‌ఎంబీ చేతబట్టి, మండల సర్వేయర్ ముబారక్‌తో పాటు, సచివాలయ సర్వేయర్లు, వీఆర్వోలతో కలిసి పట్టణంలోని జ్యోతి సర్కిల్‌కు చేరుకొని ప్రభుత్వ స్థల హద్దులు గుర్తించే పనిలో పడ్డారు. నగర పంచాయతీ కమిషనర్ జీఆర్ పల్లవి, ఏవో రమాదేవిలు సైతం జ్యోతి చౌక్‌కు చేరుకొని తమ నగరపంచాయతీ కి చెందిన స్థలాన్ని తెలపాలని రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. అయితే వర్షం కారణంగా అంతరాయం కలి గింది. ఈ విషయమై తహశీల్దార్ మహమ్మద్‌అన్సారీ మాట్లాడుతూ బి.కొత్తకోట పట్టణంలోని రంగసముద్రం రోడ్డు, బెంగళూరు రోడ్డు, మదనపల్లె రోడ్డు, పీటీయం రోడ్డులతో పాటు, జ్యోతిచౌక్ లో రెవెన్యూ రికార్డుల మేరకు ఆర్‌అండ్‌బీ కి కేటాయించిన స్థలం ఎంత? ప్రస్తుతం మిగిలింది ఎంత... ఆక్రమణకు గురైనది ఎంత? అనే విషయమై సమగ్రంగా పరిశీలించి నిర్నయం తీసుకుంటామన్నారు.