Share News

సంక్రాంతికి కొత్త రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:48 AM

రాష్ట్రంలో అర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

సంక్రాంతికి కొత్త రేషన్‌ కార్డులు

డిసెంబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల మంజూరు చేయక పోవడంతో రాష్ట్రంలో కొత్తగా పెళ్లిళ్లు అయినవాళ్లు, రాజకీయ కారణాలతో రేషన్‌ కార్డులు మంజూరు కానివారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త కార్డు కోసం వచ్చిన దరఖాస్తులు 30,611, స్ల్పిట్‌ కార్డుల కోసం 46,918, ఉన్న కార్డులో సభ్యుల చేర్పుల కోసం 2,13,007, తొలగింపు కోసం 36,588, చిరునామాల మార్పు కోసం 8,263, కార్డుల సరెండర్‌ కోసం 685.. మొత్తం 3,36,072 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారితోపాటు రాష్ట్రంలో కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డిసెంబరు నెలాఖరులోపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి అర్హులకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌కార్డులను ప్రభుత్వం అందజేయనుంది.

Updated Date - Nov 30 , 2024 | 04:48 AM