Share News

ప్రమాదాలకు నెలవుగా మలుపులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:15 AM

నంద్యాల- గిద్దలూరు ప్రధాన రహదారిలోని మలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి.

 ప్రమాదాలకు నెలవుగా మలుపులు
నల్లమల అటవీ ప్రాంతంలో మలుపులు

ఫ నంద్యాల-గిద్దలూరు

రహదారిలో తరచూ ప్రమాదాలు

ఫ మలుపుల్లో కనిపించని

సూచిక బోర్డులు

ఫ ప్రాణాలు కోల్పోతున్న

ప్రయాణికులు

నంద్యాల- గిద్దలూరు ప్రధాన రహదారిలోని మలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహ ద్దుల్లో ఉన్న ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో కొందరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. ప్రధాన రహదారి మలుపుల్లో పలు చోట్ల సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అరకొరగా ఉన్న సూచిక బోర్డుల్లో కొన్ని విరిగిపోగా, మరికొన్ని చెట్ల మధ్యలో కనిపించకుండా ఉన్నాయి. సూచిక బోర్డుల ఏర్పాటు, నిర్వహణ పట్ల సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

శిరివెళ్ల, అక్టోబరు 1 : నల్లమల అటవీ ప్రాంతం శిరివెళ్ల, మహానంది మండలాల్లోని గ్రామాల నుంచి ప్రకా శం జిల్లా సరిహద్దు వరకు విస్తరించి ఉంది. దట్టమైన రిజర్వు ఫారెస్టులో ఉన్న నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహ దారిలో చాలా చోట్ల ప్రమాదకరమైన ఘాట్‌లు, మలుపులు ఉన్నాయి. ప్ర యాణికులు ప్రమాద ప్రాంతాలను ముందుగా గుర్తించేందుకు అవసరమై న సూచిక, హెచ్చరిక బోర్డులు లేకపోవ డంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఘాట్‌ రోడ్డు కావడం, మలుపులు ఎ క్కువగా ఉండడంతో భారీ వాహనాలు, మలుపుల్లో ఉన్న కల్వర్టులను ఢీకొని వాహనాలు, ప్రయాణికులు లోయలో పడి మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. నల్లమల ఘాట్‌లోని మలు పుల్లో ఐదేళ్ల వ్యవధిలో దాదాపు మూడు వందల ప్రమాదాలు చోటు చేసుకున్నా యి. ఈ ఘటనల్లో వంద మంది వరకు మృతి చెందగా 450 మంది గాయాల పాలయ్యారు.

వైద్య సేవలకు తీవ్ర ఆటంకం

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల పరిధిలోని సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి ప్రకాశం జిల్లాలోని ది గువమెట్ట గ్రామం వరకు రహదారి మొత్తం అటవీప్రాంతంలో ఉంది. రిజర్వు ఫారెస్టు కావడంతో సెల్‌ఫోన సిగ్నల్స్‌ ఉండవు. దీంతో ప్రమాదం జ రిగిన వెంటనే పో లీసులకు, 108 వా హనానికి సమా చారం అందిం చేందుకు ఆట కం ఏర్పడు తోంది. అత్యవ సర సమయం లో క్షతగాత్రుల కు అందాల్సిన వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. రహదారిలో వెళ్తున్న ఇతర ప్రయాణికు లు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చాక మాత్రమే ప్రమాద ఘటనల గురించి హైవే పెట్రోలింగ్‌ సిబ్బందికి, పోలీసులకు తెలియజేయాల్సి వస్తోంది. రహదారిలో భారీ వాహనాలు బో ల్తాపడినా.. ఎదు రెదురుగా వాహ నాలు ఢీకొన్నా భారీగా ట్రాఫిక్‌ స మస్య తలెత్తు తోం ది. రాత్రి సమ యా ల్లో ప్ర మాదాలు చోటు చేసుకుంటే అభయారణ్యంలో ప్ర యాణికుల అవస్థ లు వర్ణనాతీతం. రహదా రి పైనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

అధికారులు చర్యలు తీసుకోవాలి

నంద్యాల-గిద్దలూరు రహదారిలో ప్రమా దాల నివారణకు అ ధికారులు చర్య లు తీసుకోవాలి. ఆర్‌ అండ్‌బీ, అట వీశాఖ అధికారులు స మన్వయంతో పని చేసి రహదారిలో బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేయా లి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రహదారి ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలి.

- చిన్నా, మహదేవపురం

అవగాహన కల్పిస్తున్నాం

రహదారి ప్రమా దా లపై ప్రజలకు అవ గాహన కల్పిస్తు న్నాం. శిరివెళ్ల, మ హానంది మండ లాల పోలీస్‌ సిబ్బం ది ప్రతిరోజూ పెట్రోలిం గ్‌ నిర్వహిస్తున్నారు. ఘాట్‌ రోడ్డులో అధిక లోడుతో వెళ్లడం, అతివేగంతో ప్రయాణిస్తుండడంతో మలుపుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. సూ చిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం.

- చిన్న పీరయ్య, ఎస్‌ఐ, శిరివెళ్ల

Updated Date - Oct 02 , 2024 | 12:15 AM