Minister Nimmala Ramanayudu: ఏకధాటిగా వర్షం.. బుడమేరు గట్టుపైనే మంత్రి నిమ్మల..
ABN , Publish Date - Sep 05 , 2024 | 08:19 AM
యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లను అధికారులు పూడుస్తున్నారు. రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి మరీ బుడమేరు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా అధికారులు గండ్లు పూడుస్తున్నారు.
అమరావతి: యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లను అధికారులు పూడుస్తున్నారు. రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి మరీ బుడమేరు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా అధికారులు గండ్లు పూడుస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు.. అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా సరే.. నిద్రాహారాలు లేకుండా బుడమేరు గండ్ల పూడిక పనులను చేయిస్తూ నిమ్మల ఉండిపోయారు.
పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకూ జోరు వానలోనే పనులను నిమ్మల పర్యవేక్షించారు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నట్టు నిమ్మల తెలిపారు. సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత నాలుగు రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనుల్లో వేగవంతం చేశామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష చేస్తున్నారని తెలిపారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో అధికారులు, ఏజెన్సీల సహకారంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
బుడమేరు నిన్న ఉగ్రరూపం దాల్చడంతో ఏపీ ప్రభుత్వం, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే సీఎం చంద్రబాబు.. బుడమేరు గండ్లు పూడిక పనులు చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నిమ్మల కూడా రాత్రంతా కుండపోత వర్షంలోనే తడుస్తూ గండ్ల పూడిక పనులను పర్యవేక్షించారు.