Share News

వలస.. కోసిగి!

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:43 AM

కూటికోసం.. కూలికోసం.. కర్నూలు జిల్లా కోసిగి రైతన్నల కుటుంబాలు కర్ణాటక బాట పట్టాయి. బతుకుదెరువు కోసం పిల్లాపాపలను వెంట పెట్టుకుని, వృద్ధులను ఇంటి దగ్గర వదిలిపెట్టి..

వలస.. కోసిగి!

కూటి కోసం, కూలి కోసం.. పొరుగు రాష్ట్రాలకు కూలీలు

1800 కుటుంబాలు వలస బాట.. పిల్లాపాపలు సహా రైలెక్కిన కర్నూలులోని కోసిగి వాసులు

కోసిగి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కూటికోసం.. కూలికోసం.. కర్నూలు జిల్లా కోసిగి రైతన్నల కుటుంబాలు కర్ణాటక బాట పట్టాయి. బతుకుదెరువు కోసం పిల్లాపాపలను వెంట పెట్టుకుని, వృద్ధులను ఇంటి దగ్గర వదిలిపెట్టి.. రైలెక్కాయి. మొత్తం 1800 కుటుంబాలు ఆదివారం ఒక్కరోజే పొరుగు రాష్ట్రానికి పయనమవడం స్థానిక పరిస్థితిని కళ్లకు కట్టినట్టయింది. కోసిగిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ వార్డుల నుంచి 1000 కుటుంబాలు, అలాగే మండలంలోని దుద్ది, పల్లెపాడు, ఆర్లబండ, చిర్తనకల్‌, మూగలదొడ్డి, కందుకూరు, కామన్‌దొడ్డి, వందగల్లు, చిన్నభోంపల్లి, పెద్దభోంపల్లి, డి.బెళగల్‌, చింతకుంట, సజ్జలగుడ్డం, ఐరంగల్‌ తదితర గ్రామాల నుంచి సుమారు 800 కుటుంబాలకు చెందిన వారు మూటలు సర్దుకుని పిల్లాపాపలతో రైలు, ఇతర వాహనాల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలసబాట పట్టారు. చదువుకుంటున్న పిల్లలను సైతం వెంట తీసుకువెళ్లారు. ప్రభుత్వాలు మారినా తమ రాతలు మాత్రం మారడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే ఉంటే కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టమని కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - Oct 21 , 2024 | 03:44 AM