జోరు తగ్గిన వరద
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:38 AM
కృష్ణమ్మ మహోగ్ర రూపం వీడింది. పూర్తిగా శాంతించింది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహ ఉధృతి భారీగా తగ్గింది.
అమరావతి/విజయవాడ/కర్నూలు/నరసరావుపేట, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మ మహోగ్ర రూపం వీడింది. పూర్తిగా శాంతించింది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహ ఉధృతి భారీగా తగ్గింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లన్నీ మూసివేశారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో డ్యాం అధికారులు బుధవారం క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఎగువ నుంచి ప్రవాహం గణనీయంగా తగ్గిపోవడంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లను కూడా మూసివేశారు. విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి మాత్రం 16 వేల క్యూసెక్కులు వస్తోంది. ఈ నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి వరద భారీగా తగ్గుముఖం పట్టింది. 3,00,767 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.