Share News

కన్నుల పండువగా లక్ష దీపోత్సవం

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:45 PM

కార్తీకమాస లక్ష దీపో త్సవం బి.కొత్తకోటలో కన్నుల పండువగా జరిగింది.

కన్నుల పండువగా లక్ష దీపోత్సవం
బి.కొత్తకోటలో లక్ష దీపోత్సవంలో పాల్గొన్న భక్తాదులు

వేలాదిగా తరలివచ్చి దీపాలు వెలిగించిన మహిళలు

బి.కొత్తకోట, నవంబరు 29(ఆం ధ్రజ్యోతి): కార్తీకమాస లక్ష దీపో త్సవం బి.కొత్తకోటలో కన్నుల పండువగా జరిగింది. పట్టణానికి చెందిన శ్రీమహావిష్నుసేన ప్రతి యేటా కార్తీకమాసం చివరలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా శుక్రవారం వేడుకను నిర్వహిం చారు. పట్టణంలోని పీటీయం రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి జ్యోతిసర్కిల్‌ వరకు సుందరంగా విద్యుత దీపాలంకరణ చేశారు. దారి పొడవునా టేబుళ్లను అమర్చి వాటిపై లక్షదీపాలు, వాటిలో తైలం వేసేందుకు కళాశాల విద్యార్థినులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సాయంత్రం తిరుపతి శ్రీనివాస మంగాపురానికి చెందిన లలితపీఠ వ్యవస్థాపక పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు స్వరూపానందగిరి స్వాముల వారిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలతో వేడుకను ప్రారంభించారు. పట్టణంలో నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా మహిళామణులు కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఏటా ఈ లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న శ్రీమహావిష్నుసేన ప్రతినిధులను పలువురు ప్రశంసించారు. సీఐ రాజారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. నగర పంచాయతీ కమిషనర్‌ జీఆర్‌ పల్లవి, ఏవో రమాదేవిలు దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:45 PM