వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:49 PM
గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తీవ్రంగా విమర్శించారు.
నంద్యాల రూరల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తీవ్రంగా విమర్శించారు. శనివారం నంద్యా ల పట్టణంలోని 29వ వార్డు ఇన్‌చార్జి సుబ్బరా యుడు ఆధ్వర్యంలో మంత్రి పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచడం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వంటి చర్యలు తీసుకుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీదేవి, వాకా శివశంకర్, గుద్దేటి వెంకటేశ్వర్లు, సాయిరాం, జ్యోతి రాయల్ తదితరులు పాల్గొన్నారు.