మంత్రాలయం వద్ద 310.050 మీటర్ల నీటి మట్టం
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:01 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం సాయంత్రం మంత్రాలయం వద్ద 310.050 మీటర్ల నీటి మట్టంతో 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.
మంత్రాలయం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి). మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం సాయంత్రం మంత్రాలయం వద్ద 310.050 మీటర్ల నీటి మట్టంతో 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. టీబీ డ్యాం నుంచి 78వేల క్యూసెక్కుల నీరు నదికి విడుదల చేశారు. డ్యాంలోకి ఇన్‌ఫ్లో 29,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో తుంగభద్ర నది రెండువైపులా సరిహద్దులను తాకుతూ పరవళ్లు తొక్కుతున్నది. దర్శనార్థం వచ్చి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు శ్రీమఠం అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నది ఒడ్డున పుట్టీలు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. నదితీర గ్రామాల ప్రజలను తహసీల్దారు రవి, సీడబ్ల్యూసీ అధికారులు, మంత్రాలయం సీఐ రామంజులు, ఎస్‌ఐ పరమేష్ నాయక్ గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నారు. పశువుల కాపరులు, చేపలు పట్టేవారు, నదితీర గ్రామాల రైతులు నదిలోకి వెళ్లొద్దని తెలిపారు.