Share News

వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలి: ఏఐఎస్‌ఎఫ్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:51 AM

స్థానిక బీసీ బాలికల ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌ వార్డెన్‌ కనకలత విధుల నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి డిమాండ్‌ చేశారు.

వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలి: ఏఐఎస్‌ఎఫ్‌
ధర్నా చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

కోడుమూరు, సెప్టెంబరు 15: స్థానిక బీసీ బాలికల ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌ వార్డెన్‌ కనకలత విధుల నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ ముందు ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, వార్డెన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని అన్నారు. నాయకులు వీరాంజనేయులు, సిద్దు, వినయ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:51 AM