జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ విశ్వేశ్వరయ్య
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:04 AM
ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు అన్నారు.
కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 15: ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా టెలికాంనగర్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ సర్కిల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాహబూబ్‌ఖాన్, ఉపాధ్యక్షుడు రామనీలా, కోశాదికారి అనంత్‌నాత్, ఉమెన్ సెక్రటరీ సనా చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ ఆవరణలో విశ్వేశ్వరయ్య భవన్ వద్ద మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పీఆర్ ఈఈలు ఎస్‌సీఈ మద్దన్న, రామక్రిష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ టూ పీఏ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్, డీఈలు నాగిరెడ్డి, రమేష్‌కుమార్ రెడ్డి, ఏఈలు గౌస్‌బాష, పార్థసారఽథి తదితరులు పాల్గొన్నారు.
సమాజాభివృద్ధికి శ్రమిస్తున్న ఇంజనీర్లు విశ్వేశ్వరయ్యను ఆదర్శకంగా తీసుకోవాలని ఐజేకే ఇంజనీరింగ్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ టి.పద్మజ అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరిం చుకుని గాయత్రి ఎస్టేట్‌లోని మోక్షగుండం విశేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అకడమిక్ మేనేజర్ పరుశరాములు, వైస్ ప్రిన్సిపాల్ స్వాములు, విద్యార్థులు పాల్గొన్నారు.