విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై స్పందించాలి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:16 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం లడ్డూ రాజకీయాలను పక్కన పెట్టి.. వేల మందికి ఉపాధి చూపుతున్న విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై స్పందించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనినబాబు డిమాండ్ చేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), అక్టోబరు 1: టీడీపీ కూటమి ప్రభుత్వం లడ్డూ రాజకీయాలను పక్కన పెట్టి.. వేల మందికి ఉపాధి చూపుతున్న విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై స్పందించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనినబాబు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షల్లో భాగంగా మంగళవారం ధర్నా చౌక్ వద్ద విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన నిరసన దీక్ష ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంటును సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివా సవర్మ విశాఖ స్టీల్ ప్లాంటు దేశంలోనే అత్యుత్తమ ప్లాంటు అని కొని యాడారని, 45 రోజుల్లో స్టీల్ ప్లాంట్‌ను రక్షించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి ప్రయత్నిస్తూంటే దానిని అడ్డుకోవాల్సిన ప్రభు త్వం సన్నాయి నొక్కులు నొక్కుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు షాబీర్ బాషా, అబ్దుల్లా, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర, నగేష్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు రంగప్ప, సోమన్న, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.