Share News

గిరిజన గ్రామంలో విద్యా కుసుమాలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:24 AM

పట్టణానికి 5 కి.మీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామం జీవరాళ్లమల తండా గ్రామంలో ఎంపీపీ పాఠశాల ఉంది. ఇక్కడ విద్యార్థులు కేవలం ముగ్గురే ఉండటంతో మూసివేసే దశలో ఉండగా ఓ ఉపాధ్యాయురాలు కళ్యాణి కృషితో నేడు 43 మంది విద్యార్థుల స్థాయికి చేరింది. కళ్యాణి 2017 నుంచి ఇక్కడే ఎస్జీటీగా పనిచేస్తున్నారు.

గిరిజన గ్రామంలో విద్యా కుసుమాలు
విద్యార్థులతో ఉపాధ్యాయురాలు కళ్యాణి

నాడు ముగ్గురే విద్యార్థులు, నేడు 43 మంది

- పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయురాలి కృషి

- నేడు టీచర్స్‌ డే..

పత్తికొండ, సెప్టెంబరు 4: పట్టణానికి 5 కి.మీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామం జీవరాళ్లమల తండా గ్రామంలో ఎంపీపీ పాఠశాల ఉంది. ఇక్కడ విద్యార్థులు కేవలం ముగ్గురే ఉండటంతో మూసివేసే దశలో ఉండగా ఓ ఉపాధ్యాయురాలు కళ్యాణి కృషితో నేడు 43 మంది విద్యార్థుల స్థాయికి చేరింది. కళ్యాణి 2017 నుంచి ఇక్కడే ఎస్జీటీగా పనిచేస్తున్నారు. బిఎస్సీ, బీఈడీ చదువుకుని 2008లో ఎస్జీటీగా ఎంపికకాగా, 2010లో హొళగుంద మండలానికి నియమితులయ్యారు. అనంతరం 2017లో గిరిజనతండా జీవరాళ్లమల తండాకు బదిలీపై వచ్చి విద్యాభివృద్ధికి కృషిచేశారు. గురుకుల, నవోదయ, సైనిక్‌ స్కూలు ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వగా గురుకులానికి 23మంది, నవోదయ ఒక విద్యార్థి ఎంపికయ్యారు. కళ్యాణి కృషిని గుర్తించిన ప్రభుత్వం కర్నూలులో 2022 ఆగస్టు 15న, అదే ఏడాది టీచర్స్‌డేలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. అలాగే విజయవాడలో స్త్రీశక్తి ప్రతిభ పురస్కార్‌, జ్యోతిరావు పూలే అవార్డులతో సత్కరించాయి.

విద్యతోనే భవిష్యత్తు

మాది మారుమూల గ్రామం. నాన్న ప్రభుత్వో ద్యోగి. మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను చూసి బాధ కలిగింది. గిరిజన గ్రామంలో విద్యార్థులకు చదువు నేర్పాలన్న సంకల్పంతో పనిచేశా. నా భర్త రమేష్‌ సహకరించారు. విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుంది.

- కళ్యాణి, ఉపాధ్యాయురాలు

Updated Date - Sep 05 , 2024 | 12:24 AM