ప్రమాదంలో ఉర్దూ స్కూల్
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:22 AM
కల్లూరు అర్బన పరిధిలోని 30వ వార్డు రాఘవేంద్రనగర్‌లో మున్సిపల్ ఉర్దూ స్కూల్‌కు ప్రమాదం పొంచి ఉంది.
శిథిలావస్థలో పాఠశాల భవనం
పెచ్చులూడి పడుతున్న పై కప్పు
ఆందోళనలో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు
కల్లూరు, సెప్టెంబరు 11: కల్లూరు అర్బన పరిధిలోని 30వ వార్డు రాఘవేంద్రనగర్‌లో మున్సిపల్ ఉర్దూ స్కూల్‌కు ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు పడుతుండటం పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఉపాధ్యా యులు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నగరంలో కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనం పెచ్చులూడి వంటశాలలోని ఫ్ల్లోరింగ్ కూలిపోతుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విధ్యార్థులకు పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తు న్నారు. మున్సిపల్ అధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి మున్సిపల్ ఉర్దూ స్కూల్‌ను మరో చోటుకి మార్పు చేయాలని కోరుతున్నారు.
అధికారుల దృష్టికి సమస్య: రాఘవేంద్రానగర్‌లోని మున్సిపల్ స్కూల్ సమస్యను కలెక్టర్, నగరపాలక సంస్థ, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకె ళ్లామని ప్రధానోపాధ్యాయురాలు పి.రహీఖాతూన తెలిపారు. నగరంలోని గడ్డావీధిలో ఉండే మున్సిపల్ ఉర్దూ స్కూల్ భవనం బాగోలేక అప్పటి కమి షనర్ రవీంద్రబాబు రాఘవేంద్రానగర్‌కి బదిలీ చేశారన్నారు. అప్పటి నుంచి ఓ భవనంలో ఉచితంగా పిల్లలకు పాఠాలు చెపుతున్నామని వివరించారు. ప్రస్తుత ం ఇక్కడ కూడా స్కూల్ భవనం శిఽథిలావస్థకు చేరడంతో పిల్లలకు భద్రత కొరవడిందని అన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 58 మంది పిల్లలు చదువుకుంటున్నారని, రెండు గదుల్లో పాఠాలు బోధిస్తూ, వంట కూడా ఇక్కడే వండుతున్నట్లు తెలిపారు. పాఠశాల భవనం పెచ్చులూడి పడుతుం డటంతో భయంగా ఉందని అధికారులు స్పందించి పాఠశాలను ఇక్కడి నుంచి మార్పు చేయాలని కోరారు.
సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
నగరపాలక సంస్థ కమిషనర్ బదిలీ అయ్యారు. కమిషనర్ రాగానే సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. జిల్లా విద్యాశాఖ అధికా రులకు విషయం తెలిపి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
- విజయకుమారి, కర్నూలు అర్బన ఎంఈఓ