హుండీ పగులగొట్టి డబ్బులు తీసుకెళ్లారు
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:20 AM
దేవరగట్టు మాళమల్లేశ్వర ఆలయంలో రెండు హుండీల తాళాలు పగలగొట్టి దుండగులు డబ్బులు తీసుకెళ్లినట్లు ఆలయ చైర్మన గుమ్మ నూరు శ్రీనివాసులు బుధవారం తెలిపారు.
హొళగుంద, సెప్టెంబరు 11: దేవరగట్టు మాళమల్లేశ్వర ఆలయంలో రెండు హుండీల తాళాలు పగలగొట్టి దుండగులు డబ్బులు తీసుకెళ్లినట్లు ఆలయ చైర్మన గుమ్మ నూరు శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కమిటీ, అధికారులకు సమాచారమివ్వ కుండా లక్షల రూపాయలు తీసుకువెళ్లడంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మరో రెండు హుండీలను గుంతకల్లు ఎమ్మెల్యే జయ రాం సమక్షంలో లెక్కించారు. రూ.2.60 లక్షల నగదు, ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. వీర నాగప్ప, రాము నాయక్, మల్లయ్య, శేఖన్న, రామయ్య పాల్గొన్నారు.
టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి వారిని బుధవారం ఆయన దర్శించుకున్నారు.