Share News

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:08 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభి వృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
పెన్షన్లను పంపిణీ చేస్తున్న మంత్రి

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల కల్చరల్‌, అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభి వృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ పెంచారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపడం మొదలుపెట్టారని, సంక్షేమంతోపాటు అభివృద్ధి చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. వంద రోజుల పాలనలో పింఛన్ల పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, దీపావళికి మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నంద్యాల ఎస్‌బీఐ కాలనీలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పఽథకం కింద లబ్ధ్దిదారులకు కలెక్టర్‌ రాజకుమారి పింఛన్‌ అందజేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 2,12,712 మందికి పింఛన్‌ పంపిణీ చేసి 97.47శాతం పంపిణీ పూర్తి చేశామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 12:08 AM