ముగిసిన టెట్
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:19 AM
ఉపాధ్యాయ అర్హత(టెట్) పరీక్ష సోమవా రం ముగిసింది. ఈ నెల 3న టెట్ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 54,083 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్నారు.
కర్నూలు, ఎడ్యుకేషన్, అక్టోబరు 21 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయ అర్హత(టెట్) పరీక్ష సోమవా రం ముగిసింది. ఈ నెల 3న టెట్ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 54,083 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్నారు. కర్నూలు, హైదరాబాద్‌లో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా రు. కర్నూలులో నాలుగు, ఆదోని, ఎమ్మిగనూరులో ఒక్కోక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. అలాగే, హైదరాబాద్‌లో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 40,660 మంది, హైదరా బాద్‌లో 13,423 మంది అభ్యర్థులను కేటాయించా రు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి, మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి, సాయంత్ర 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో ఆన్‌లైన్ పరీక్షలు కొనసాగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ ఆధ్యర్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్‌తోపాటు స్క్వాడ్ బృందాలు పరీక్షా కేంద్రా లను పర్యవేక్షించాయి. చివరిరోజు జరిగిన పరీక్షకు మొత్తం 1,898 మంది అభ్యర్థులకు గాను 1,614 మంది హాజరయ్యారు. 284 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 1,504 మందికిగాను 1,323 మంది హాజరుకాగా, 181 మంది గైర్హాజర య్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 394 మందికి గాను 291మంది హాజరుకాగా, 103 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను డీఈవో శామ్యూల్, అధికారులు పర్యవేక్షించారు.