ఆర్‌యూలో టీడీపీ నాయకుడి హల్‌చల్
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:27 PM
రాయలసీమ యూనివర్సి టీలో పది రోజులుగా ఓ టీడీపీ నాయకుడు హల్‌చల్ చేస్తున్నాడు. తాను సీఎం సన్నిహితు డినంటూ పలు విభాగాల్లో హడావుడి చేస్తు న్నాడు.
ఓ ప్రొఫెసర్‌కు పోస్టింగ్ ఇవ్వాలంటూ హడావుడి
పలు విభాగాల్లో సీఎం సన్నిహితుడినంటూ పరిచయం
ఏమి జరిగినా తనకు సమాచారం ఇవ్వాలంటూ హుకుం
కర్నూలు అర్బన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సి టీలో పది రోజులుగా ఓ టీడీపీ నాయకుడు హల్‌చల్ చేస్తున్నాడు. తాను సీఎం సన్నిహితు డినంటూ పలు విభాగాల్లో హడావుడి చేస్తు న్నాడు. మంగళవారం శ్రీ క్రిష్ణ దేవరాయ యూనివర్సిటీలో పని చేస్తున్న ఓ ప్రొఫెసర్‌ను తీసుకెళ్లి డిప్యుటేషన్‌పై పోస్టింగ్ ఇవ్వాలంటూ ఇన్‌చార్జి వీసీ ఎన్‌టీకే నాయక్‌ను కోరారు. తాను ఇన్‌చార్జిని మాత్రమేనని, రెగ్యులర్ వీసీ వచ్చాక పరిశీలిస్తారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాను అధికార పార్టీ కీలక నాయకుడి ఆదేశాలతో వచ్చానని, తన మాటకు విలువ ఇవ్వాల్సిందేనంటూ చాంబర్‌లో బెదిరింపులకు దిగినట్టు సమాచారం. పక్కనే ఉన్న రిజిస్ట్రార్ జోక్యం చేసుకొని పద్ధతి ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి వర్సిటీలోని పలు విభాగాల్లోకి వెళ్లి తాను సీఎం సన్నిహితుడినని, క్యాంపస్‌లో ఏం జరిగినా తన దృష్టికి తీసుకు రావాలని కొందరు ప్రొఫె సర్లకు హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఆయన వ్యవహార శైలిపై ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై రిజిష్ట్రార్ బోయ విజయకుమార్ నాయుడును వివరణ కోరగా క్యాంపస్‌లోకి ఓ నాయకుడు వచ్చిన మాట వాస్తవమేనన్నారు.