Share News

వరద బాధితులకు టీడీపీ నాయకుల సాయం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:24 AM

విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. బుధవారం వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.

వరద బాధితులకు టీడీపీ నాయకుల సాయం
దుప్పట్లు, వసా్త్రలు అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ

విజయవాడలో ఇంటింటికీ తిరిగి అందజేత

ఎమ్మిగనూరు, సెప్టెంబరు11: విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. బుధవారం వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.

పత్తికొండ: వెయ్యి నిత్యావసరాల కిట్లను బుధవారం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పంపిణీచేశారు. విజయవాడ 48వ డివిజన పరిదిలోని భవానిపురంప్రాంతంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో పాటు టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, జ్ఞానేశ్వర్‌గౌడ్‌, సుబ్బరాయుడు, ఎల్వీప్రసాద్‌, శ్రీధర్‌రెడ్డి ఇంటింటికి తిరిగి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు.

ఆలూరు: విజయవాడ వైఎస్సార్‌ కాలనీలో౉ టీడీపీ నాయకుడు వీరభద్రగౌడ్‌ 1,500 కిట్లు పంపిణీ చేశారు. టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్‌, జ్యోతి రూ.1లక్షను మంత్రి లోకేష్‌కు అందజేశారు.

కౌతాళం: వరద బాధితుల సహాయారథం టీడీపీ కౌతాళం అధ్యక్షుడు విశ్వనాథ్‌ విరాళాలు సేకరించారు. మంజునాధ, సిద్దు, రాజబాబు, భీమయ్య, సిద్దు, చంద్రశేఖర్‌, గిడ్డయ్యలు పాల్గొన్నారు.

కస్తూర్భా విద్యార్థినుల సాయం

మద్దికెర: వరద బాధితుల సహాయార్థం కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు రూ.5,100లు అందజేశారు. ఆపద్బాందవ సేవా సమితి వ్యవస్థాపకులు చొక్కా సునీల్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు: పట్టణానికి చెందిన మల్లెల గ్రూప్స్‌ నిర్వా హకులు మల్లెల ఆల్‌ఫ్రెడ్‌ రాజు జూనియర్‌ కళాశాల వద్ద విరాళాలు సేకరించారు. సామేల్‌, నరసన్న పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:24 AM