సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఆత్మహత్య
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:49 AM
ఆళ్లగడ్డ మండలంలోని ఆల్ఫా ఇంజనీరింగు కళాశాల సమీపంలోని పొలాల్లో కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి కుమారుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సౌరేశ్వరరెడ్డి(32) విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 12: ఆళ్లగడ్డ మండలంలోని ఆల్ఫా ఇంజనీరింగు కళాశాల సమీపంలోని పొలాల్లో కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి కుమారుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సౌరేశ్వరరెడ్డి(32) విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివా రం రాత్రి చెన్నై వెళ్లేందుకు మాయలూరులో సౌరేశ్వరరెడ్డిని తండ్రి బస్సు ఎక్కించాడు. మృతుడు ఆళ్లగడ్డలో చెన్నైకి రిజర్వేషన్ చేసుకొని వెళ్తూ మార్గమద్యలో ఆల్ఫా కాలేజి వద్ద రాత్రి దిగి పొలాల్లో విషపు మందు తాగి ఆపస్మారక స్థితిలో పడిపోయాడు. తెల్లారి పొలాలకు వెళ్లె కూలీలు మృతుడిని చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య శ్రీలేఖ, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.