Share News

రేపటి నుంచి శ్రీగిరిపై శరన్నవరాత్రులు

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:42 PM

: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం మహా క్షేత్రంలో అక్టోబరు 3 గురువారం నుంచి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

 రేపటి నుంచి శ్రీగిరిపై శరన్నవరాత్రులు

శ్రీశైలం, అక్టోబరు 1: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం మహా క్షేత్రంలో అక్టోబరు 3 గురువారం నుంచి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాలను పురస్క రించుకుని ప్రతి రోజూ స్వామి అమ్మవార్లకు వాహన సేవలు ఉంటాయి. భ్రమ రాంబికాదేవి వివి ధ అలంక రణలో భక్తులకు దర్శనమి వ్వనున్నారు. మహోత్సవాల సంద ర్భంగా క్షేత్రాన్ని అలంకరిస్తున్నారు. భక్తులకు దేవస్ధానం అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు.

గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారి యాగశాల ప్రవేశంతో దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం స్వామివారి యాగశాల ప్రవేశం, మధ్యాహ్నకాలార్చనలు, మహా నివేదన, సాయంత్రం 5 గంటల నుంచి పూజలు, గణపతి, రుద్ర, చండీ, లలితా పారాయణాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం, చండీ హోమం, కాళరాత్రి పూజ, నీరాజన మంత్ర పుష్పాలు, అమ్మవారికి ఆస్థానసేవ, తీర్థప్రసాద వితరణ జరపనున్నారు. ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, భ్రమరాంబికాదేవి అమ్మవారికి అలంకరణలు నిర్వహించనున్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:42 PM