పేదల అభ్యున్నతి కోసమే ఆర్డీటీ సేవలు
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:22 AM
గ్రామాల్లో నిరుపేదల కుటుంబాల అభ్యున్నతి కోసమే ఆర్డీటీ సేవలందిస్తుందని స్పెయిన్ దేశస్థులు మ్యానెల్, క్యాటీ అన్నారు.
మంత్రాలయం, సెప్టెంబరు 15: గ్రామాల్లో నిరుపేదల కుటుంబాల అభ్యున్నతి కోసమే ఆర్డీటీ సేవలందిస్తుందని స్పెయిన్ దేశస్థులు మ్యానెల్, క్యాటీ అన్నారు. ఆదివారం వగరూరు గ్రామానికి చెందిన సామేలు, సోనియా కుటుంబాన్ని సందర్శించారు. విద్య, సంక్షేమం, వైద్యం, భూముల అభివృద్ది, కుట్టు శిక్షణ, వంటి సేవలు ఉచితంగా అందిస్తామన్నారు. పిల్లలు ప్రసన్నరాణి, రాజు, యువరాజుకు దుస్తులు, సరుకులు, మిఠాయిలు అందజేశారు. ఏరియా టీం లీడర్ కృష్ణయ్య, సీఓ నరసింహులు, లీడర్లు లాజరు, సంసోను, మత్తయ్య, మునెప్ప, ఆదాము, ఏసేపు, దానియేలు పాల్గొన్నారు.