నిత్యావసరాల ధరలు తగ్గించాలి: సీపీఐ
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:28 AM
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరలు తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, రఘురామ్మూర్తి డిమాండ్ చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన బుధవారం కేజీ రోడ్డుపై ధర్నా చేశారు.
నందికొట్కూరు, సెప్టెంబరు 4: నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరలు తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, రఘురామ్మూర్తి డిమాండ్ చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన బుధవారం కేజీ రోడ్డుపై ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయల ధరలు అకాశాన్ని అంటుతున్నాయని, దీనికి తోడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందే తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రెట్లు అధికంగా రేట్లు పెరిగాయని ఆరోపించారు. సామాన్యులు మూడు పూటలా భోజనం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారరు. అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఆహార భద్రత చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏపీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి రజితమ్మ, భాను, సులోచనమ్మ, ఏఐటీయూసీ వెంకటేశ్వర్లు, డేవిడ్ రమేష్, దావీద్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వినోద్, భార్గవ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దిన్, రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఆపార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో చౌక దుకాణాల ద్వారా 16 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారని, అదేతరహాలో మన రాష్ట్రంలో కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ హరికృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. నాయకులు హరికృష్ణ, వెంకటశివుడు, స్వాతి, ముర్తుజావలి, సిద్ధయ్య, పుల్లయ్య తదితరులు ఉన్నారు.