Share News

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:24 AM

పట్టణంలోని జడ్పీహెచ్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి 1998-99 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం శ్రీ విద్యా నికేతన్‌ స్కూల్‌లో కలుసుకున్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
వెల్దుర్తి: ఉపాధ్యాయుడిని సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

వెల్దుర్తి, సెప్టెంబరు, 15: పట్టణంలోని జడ్పీహెచ్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి 1998-99 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం శ్రీ విద్యా నికేతన్‌ స్కూల్‌లో కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమ తెలుగు ఉపాధ్యాయుడు శంకర య్యను సన్మానించారు. ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకేనేందుకు పూర్వ విద్యార్థి మురళిగౌడ్‌ రూ.35వేలు విరాళం ప్రకటించారు.

25ఏళ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

ఎమ్మిగనూరు టౌన్‌: పట్టణంలోని వేణువిద్యాలయం ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ పదోతరగతి 1999-2000 బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. ఉత్తమ్‌ ఫంక్షన్‌ హాల్‌లో 25 ఏళ్ల తరువాత సమావేశమయ్యారు. కొందరు ప్రభుత్వ,ప్రైవేట్‌ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. మిత్రులను కలుసుకొని గత స్మృతులను స్మరించుకున్నారు. నాటి హెచ్‌ంఎం. కీ.శే. యూ.యూ.ఉరుకుందు చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఉపాధ్యాయులు సుధాకర్‌, నాగరాజు, వెంకటేష్‌, వేణుగోపాల్‌, ఉమా హాజరయ్యారు. తామ విద్యా, బుద్ధులు నేర్పిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఉపాధ్యా యులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. విద్యార్థులు రాజశేఖర్‌, నీలకంఠ, ఉరుకుందరెడ్డి, రమేష్‌, జయరాము, ఆది, సతీష్‌, ఉమా, శ్రీదేవి, సుధా పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:24 AM