టీబీ డ్యామ్‌కు నూతన గేట్లు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:21 AM
తుంగభద్ర డ్యాంకు నూతన గేట్లు అమర్చాలని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఆలూరు, సెప్టెంబరు 11: తుంగభద్ర డ్యాంకు నూతన గేట్లు అమర్చాలని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ నెల క్రితం గేటు కొట్టుకు పోయి, 32 టీఎంసీల నీరు వృథాగా పోయిందని, రైతులు నష్టపోయారన్నారు. ఆంధ్రప్రదేశ, కర్ణాటక ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అరికెర వెంకటేశ్వర్లు, వీరేష్, నాగేంద్ర, మల్లి, గిరి, శివ, మాదన్న, వరుణ్, రాజు పాల్గొన్నారు.