Share News

జలంలేని మిషన్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:18 AM

kurnool news

జలంలేని మిషన్‌
అలంకారప్రాయంగా ఉన్న ఇంటింటి కొళాయిలు

- అతీగతి లేని జలజీవన్‌ మిషన్‌

- ప్రజలకు అందని తాగునీరు

మద్దికెర, సెప్టెంబరు 15: మండలంలో 45వేల జనాభా ఉండగా, ఓటర్లు 12వేలమంది. క్రేంద ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ పేరుతో పథకంతో ఇంటింటికీ నేరుగా కొళాయి ద్వారా ఉచితంగా నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రకటన క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఇందుకు రూ2. కోట్లు మంజూరు చేశారు. మద్దికెర సాయినగర్‌ కాలనీ, బొజ్జనాయుని పేట, ఎస్సీ కాలనీలో ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. పైపులైన్లు ఏర్పాటు చేసి, సాయినగర్‌లో మాత్రం ఇంటింటికీ కొళాయిలు కూడా బిగించారు. కానీ ఇంత వరకు నీరు మాత్రం సరఫరా కాలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు ఆగిపోయినట్లు సమాచారం.

పనులు త్వరగా పూర్తి చేయాలి

ఇంటింటికి కొళాయి ద్వారా నీరు అందించాలి. ఎనిమిది నెలల కిందట కొళాయిలు బిగించారు. కానీ నీరు రావడం లేదు.

- గుడి ఎల్లప్ప, సాయినగర్‌, మద్దికెర

త్వరలో తాగునీరు

ఓవర్‌హెడ్‌ ట్యాంకు పనులు చేస్తున్నాం, పైపులైన్‌ పనులు పూర్తి అయ్యాయి. తర్వలోనే ఇంటింటికి తాగునీరు అందిస్తాం

- మయాంక్‌, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

Updated Date - Sep 16 , 2024 | 12:18 AM