గ్రామ పంచాయతీకి అనుసంధానం చేయాలి
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:03 AM
సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీకి అనుసంధానం చేయా లని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి కోరారు
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీకి అనుసంధానం చేయా లని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదికలో కలెక్టర్ రంజిత బాషాకు వినతి పత్రం అందజే శారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వం అమలు చేసిన గ్రామ, వార్డు సచివా లయ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంద న్నారు. ప్రతి సచివాలయంలో 11మంది ఉద్యోగులను నియమించి వారిపైన సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేక తీవ్ర గందరగో ళంగా తయారైందని ఆరోపించారు. కార్యక్ర మంలో ఎన.లెనినబాబు, పి.దామోదర్ రెడ్డి, బాలపీరా పాల్గొన్నారు.